Monday, 24 November 2014


సూర్యోదయం



 


అరునొదయ వేళ వెదజల్లెను కిరణం 
ఉదయించే స్నేహం రవి భానుని ప్రతిరూపం
!!అరుణొ..!!


వికసించిన పూవులలొన కనిపించే ఆనందం 
పసి కూనల మనసులలోన పరుగెత్తే నీకోసం 
ప్రతివాకిలి లోగిలిలోన చిందులువేసే సంబరం 
గుండెలలోన నిండే నీరాకతో పురివిప్పెను పించం
!!అరుణొ..!! 


ఆకాశానికి ఈ తార వెలుగే ఆమణి ధీపం 
పేదోడి, ఉన్నోడి మదిలోన విరిసే హేమంతం 
లొకాలకే చిరునవ్వులు కురిపించే ఈ ప్రభాతం 
భారతావనికే వన్నెను తెచ్చును సూర్యోదయం 
!!అరుణొ..!!

No comments:

Post a Comment